ఏ క్షణమైనా తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత || Oneindia Telugu

2019-06-14 392

The government has decided to demolish existing blocks in the secretariat and replace them with a new secretariat. Departments of the Secretariat will be transferred to Officers' Offices/Commissionerate/Directorates.
#telangana
#secretariat
#demolition
#buildings
#cmkcr
#departments
#government

ఉమ్మడి ఏపిలో పాలనా కేంద్రమైన సెక్రటేరియట్ ఇక మనకు కనిపించదు. వాటి స్థానంలో కొత్త భవంతులు రాబోతున్నాయి. సచివాలయంలో ఇప్పటికే ఉన్న బ్లాకులను కూల్చి, వాటి స్థానంలో కొత్తగా సచివాలయ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్‌లో ఉన్న శాఖలను విభాగాధిపతుల కార్యాలయాలకు/ కమిషనరేట్లు/డైరెక్టరేట్లకు తరలించనున్నారు. ఈ తరలింపును నెలరోజుల్లోపు పూర్తిచేయనున్నారు. నిజానికి ఆయా శాఖలను ఏపీ సచివాలయంలోని బ్లాకుల్లోకి తరలించి, తెలంగాణ బ్లాకులను కూల్చి అక్కడ కొత్తగా సచివాలయం నిర్మించాలని మొదట అదికారులు భావించారు. కానీ, ఇప్పుడు అలా కాకుండా ఏకకాలంలో సచివాలయంలోని బ్లాకులన్నీ కూలగొట్టి వాటి స్థానంలో కొత్తవి కడితేనే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Videos similaires